బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం

బంజారాహిల్స్ లో ఘోర రోడ్డు ప్రమాదం

హైదరాబాద్ : కొత్తేడాదికి గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెబుతోన్న తరుణంలో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ ఉదయం 5:30 గంటల ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లే రహదారిపై రాయల్ టిఫిన్ సెంటర్ దగ్గర ఈ సంఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన సెలేరియో కారు రోడ్ నంబర్ 3 వద్ద ఆగి ఉన్న ఫోక్స్ వాగెన్, వాగనర్ కార్లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు పాదాచారులు (ఒక మహిళ) మృతి చెందారు. మృతులను భీమవరంకు చెందిన ఈశ్వరి, రావుల పాలెంకు చెందిన శ్రీనివాస్ గా గుర్తించారు. ఇంద్ర నగర్ లో నివాసం ఉంటున్న ఈశ్వరి ఇళ్లలో చిన్నపాటి పనులు చేసుకుంటూ ఉపాధి పొందుతుంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి గాయాలయ్యాయి. కార్ నడిపిన ఇద్దరు మణిపాల్ యూనివర్సిటీకి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులుగా పోలీస్ లు గుర్తించారు.

ప్రమాదానికి డ్రంక్ అండ్ డ్రైవ్ కారణం అని పోలీస్ ల దర్యాప్తులో తేలింది. ఓవర్ స్పీడ్ లో వచ్చిన కార్ అదుపు తప్పి ముందు డివైడర్ ని ఢీ కొట్టింది. తర్వాత ఆగి ఉన్న కార్లవైపు వెల్లింది. ఘటనకు కారణమైన నిందితులను పోలీస్ లు అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. మృతదేహాలను ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.