ఎంత ఘోరం.. ఎంత ఘోరం.. విధి రాతను.. విధి నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఈ ఘటన చెబుతోంది. 2025, జనవరి 22వ తేదీన మహారాష్ట్రలో జరిగిన రైలు ప్రమాదంలో అత్యంత విషాదంగా మారింది. రైలులో వెళుతున్న ప్రయాణికులు ప్రాణ భయంతో బయటకు దూకేస్తే.. ఎదురుగా వచ్చిన మరో రైలు ఢీకొని చనిపోయారు. రైలు పట్టాలపై చెల్లాచెదురుగా పడిన మృతదేహాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..
మహారాష్ట్రలోని జలగావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తోన్న పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగినట్లు వదంతులు వ్యాపించడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళకు గురై చైన్ లాగి ట్రైన్‌ను ఆపేశారు. అనంతరం ట్రైన్ దిగి పట్టాలు దాటుతుండగా.. అదే సమయంలో ఎదురుగా వచ్చిన బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులపై నుంచి దూసుకుపోయింది.
ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు మృతి చెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. జల్గావ్‌లోని పరండా స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులు, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, రెస్య్కూ టీమ్స్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. పట్టాలపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఘటన స్థలం భీతావాహంగా మారింది.
క్షతగాత్రుల ఆర్తనాదాలతో భయంకరంగా మారింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్ ఒక్కసారిగా బ్రేక్ వేయడంతో నిప్పురవ్వలు చెలరేగగా.. అది చూసి ప్రయాణికులు అగ్ని ప్రమాదం జరిగిందని భావించడంతోనే ఈ విషాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మహారాష్ట్రలోని జలగావ్లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. పుష్పక్ ఎక్స్‌ప్రెస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగి 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు ప్రయాణికులు మంటలకు భయపడి రన్నింగ్ ట్రైన్లో నుంచి కిందకు దూకారు. అదే సమయంలో ఎదురుగా వస్తున్న బెంగుళూరు ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులను ఢీకొట్టినట్లు తెలుస్తోంది. జల్గావ్‌లోని పరండా స్టేషన్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. పుష్పక్ ఎక్స్ ప్రెస్ బ్రేక్ వేయడంతో నిప్పురవ్వలు చెలరేగగా అవి అంటుకుని ట్రైన్లో మంటలు వ్యాపించినట్లు సమాచారం. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, సహయక బృందాలు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టాయి. ఈ ఘటనలో మృతుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.