
మెదక్ , వెలుగు : మెదక్ జిల్లా మెదక్ మండలం కూచన్‌పల్లిలో ఒకే రోజు తండ్రీకొడుకులు చనిపోయారు. కూచన్‌పల్లికి చెందిన పడాల రమేశ్ (48) కు రెండు కిడ్నీలు దెబ్బతినగా 15 ఏండ్ల కింద ఇతడి తండ్రి లచ్చయ్య ఒక కిడ్నీ ఇచ్చాడు. అప్పటి నుంచి బాగానే ఉన్నాడు. హైదరాబాద్‌లో ఓ ట్రావెల్స్‌లో జాబ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇటీవల రమేశ్ కిడ్నీ దెబ్బతినగా కుటుంబ సభ్యులు ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున చనిపోయాడు. డెడ్‌బాడీని కూచన్‌పల్లికి తీసుకువచ్చి అంత్యక్రియలు పూర్తి చేశారు. కొడుకు మృతితో మనోవేదనకు గురైన రమేశ్ తండ్రి లచ్చయ్య (74) శనివారం రాత్రి కన్నుమూశాడు. రమేశ్‌కు భార్య, ఇద్దరు కొడుకులు ఉన్నారు.