బిజినెస్​లో నష్టాలు.. డ్రగ్స్​ స్మగ్లర్లుగా తండ్రీకొడుకు

బిజినెస్​లో నష్టాలు.. డ్రగ్స్​ స్మగ్లర్లుగా తండ్రీకొడుకు

మల్కాజిగిరి, వెలుగు: బిజినెస్​లో నష్టాలు రావడంతో మధ్యప్రదేశ్​కు చెందిన తండ్రీకొడుకు డ్రగ్స్​స్మగ్లర్లుగా మారారు. హైదరాబాద్​లోని వేర్వేరు ప్రాంతాల్లో విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను రాచకొండ సీపీ సుధీర్​బాబు శనివారం నేరెడ్​మెట్ లోని ఆఫీసులో వెల్లడించారు.

మధ్యప్రదేశ్ రాష్ట్రం రత్లం జిల్లా జోరాకు చెందిన హనీష్ షా అలియాస్ హనీఫ్(65)కు ఎనిమిది మంది పిల్లలు. మూడో కొడుకు సిద్దిఖ్ షా అలియాస్​ సిద్దిఖ్(31). హనీష్​షా స్క్రాప్, సిద్దిఖ్ షా కాస్మోటిక్స్​బిజినెస్​చేస్తున్నారు. కొంతకాలంగా ఇద్దరి వ్యాపారం తగ్గిపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పెరిగాయి. ఎలాగైనా ఆర్థికంగా పుంజుకోవాలనే ఆలోచిస్తూ డ్రగ్స్​స్మగ్లింగ్, విక్రయాన్ని ఎంచుకున్నారు.

లోకల్​డ్రగ్స్​స్మగర్ల ద్వారా డ్రగ్స్​ఎక్కడ దొరుకుతాయో తెలుసుకున్నారు. రాజస్టాన్​లోని ప్రతాప్​ఘడ్ కు చెందిన మొంటు అనే డ్రగ్స్​సప్లయర్​నుంచి తక్కువ ధరకు హెరాయిన్​కొని హైదరాబాద్​కు తీసుకొస్తున్నారు. సిటీలోని వేర్వురు ప్రాంతాల్లో అధిక ధరకు విక్రయిస్తున్నారు. వారం కింద మరోసారి ప్రతాప్​ఘడ్ కు వెళ్లిన తండ్రీకొడుకు మొంటు వద్ద రూ.6 లక్షలకు 10 గ్రాముల హెరాయిన్​ కొన్నారు.

అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ వచ్చారు. హనీఫ్ షా, సిద్దిఖ్​షాబాలాపూర్​లోని ఓ రెస్టారెంటులో ఉన్నట్లు సమాచారం అందుకున్న మహేశ్వరం ఎస్ఓటీ పోలీసులు, బాలాపూర్ పోలీసులతో కలిసి రైడ్​చేశారు. తండ్రీకొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా, 100 గ్రాముల హెరాయిన్ దొరికింది. వారిని అరస్ట్​చేసి హెరాయిన్ ను, రూ.13వేల క్యాష్, మూడు సెల్​ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

మైలార్​దేవ్​పల్లిలో 100 గ్రాముల  ఎండీఎంఏ డ్రగ్స్ పట్టివేత

శంషాబాద్: మైలర్ దేవ్ పల్లి పరిధిలోని ఫ్రెండ్స్ కాలనీలో సైబరాబాద్​ఎస్ఓటీ పోలీసులు100 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్​పట్టుకున్నారు. ముంబైకు చెందిన యువకుడితోపాటు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. గోవా నుంచి తీసుకొచ్చి సిటీలో విక్రయిస్తున్నట్లు గుర్తించారు. నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.