కుత్బుల్లాపూర్ బౌరంపేట్ లో విషాదం చోటుచేసుకుంది. కొడుకు ఇంటి నుంచి వెళ్లిపోయాడని మనోవేదనకు గురైన తండ్రి హఠాన్మరం చెందాడు. దీంతో గ్రామాంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
అసలేం జరిగిదంటే.? డి. పోచంపల్లి సర్వే నంబర్ 188లో 1.13 ఎకరాల భూమి విషయంలో త్రిపుర ల్యాండ్ మార్క్ వెంచర్ నిర్వాహకులు, స్థానిక కార్పొరేటర్ తనను వేధిస్తున్నారని వంపు గూడెం మాధవ రెడ్డి అనే వ్యక్తికి జూలై 7న సీఐకి ఫిర్యాదు చేశారు. నన్ను మానసికంగా వేధిస్తున్నారు బూతులు తిడుతున్నారు. మనస్తాపానికి గురైనే నేను వేధింపులు తట్టుకోలేక ఇంటి నుంచి వెళ్లిపోతున్నా. నా పిల్లల్ని కాపాడండి..పిల్లలు నన్ను క్షమించండి.. అమ్మనాన్న, భార్య క్షమించండని లేఖ రాసి వెళ్లిపోయారు.
అయితే తన కుమారుడు ఇంటి నుండి వెళ్లి పోయడానికి మనో వేదనకు గురయిన మాధవరెడ్డి తండ్రి వంపు గూడెం కృష్ణారెడ్డి హ్యాటన్మరణం చెందాడు. ఉదయం వరకు బాగానే ఉన్న అతను ఒక్కసారిగా మృతి చెందండం పై గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. భూ వివాదంలో ప్రభుత్వ అధికారుల వైఫల్యమే ఇంత వరకు దారి తీసిందని బౌరంపేట్ రైతుల ఆగ్రహం చేస్తున్నారు.