
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళా కానిస్టేబుల్ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సంగారెడ్డి జిల్లా కొల్లూరు పోలీస్ స్టేషన్ లో మహిళా కానిస్టేబుల్ గా ఫాజియా( 26) విధులు నిర్వహిస్తుంది. 2023 అక్టోబర్ 15 తేదీన రోజున రోడ్డు ప్రమాదంలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం కోసం హైదరాబాద్ లోని మేడికోర్ మాదాపూర్ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నవంబర్ 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఫాజియా మృతి చెందింది. ఆమె మృతి పట్ల కొల్లూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది కన్నీటి పర్యంతమయ్యారు.
Also Read :- రాజేంద్రనగర్ అగ్నిప్రమాదం కేసులో అనుమానాలు.. యువకుడి పనేనా..?