దేవరకొండ, నల్గొండ, నకిరేకల్, ఆలేరు, హుజూర్ నగర్లో కొత్త పార్క్‌లు
పలు చోట్ల భూములుదొరక్క ఇబ్బందులు
జాతీయ, రాష్ట్ర రహదారుల వెంట భూములకే ప్రాధాన్యం
నల్గొండ, వెలుగు :ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్తగా మరికొన్ని ఇండస్ట్రియల్ పార్క్‌లు రాబోతున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు, కొత్తగా మరికొన్ని పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటు చేయాలని పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ ఆలోచిస్తోంది. ఆ దిశగా ఇప్పటికే ఉమ్మడి జిల్లాలోని జాతీయ, రాష్ట్ర రహదారులకు ఆనుకుని ఉన్న ప్రధాన మండలాలు, పట్టణాలకు సమీపంలో ఇండ్రస్ట్రియల్ పార్క్‌ల కోసం స్థలాన్ని సేకరిస్తోంది. కొన్ని చోట్ల ప్రభుత్వ భూములు అందుబాటులోనే ఉన్న ప్పటికీ, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం అసైన్డ్ భూముల పైనే ఆధారపడి పడాల్సి వస్తోంది. అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకోవడం పైన పలు చో ట్ల రైతులు, బాధితుల నుంచి ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నచ్చజెప్పి భూములు స్వాధీనం చేసుకునేందుకు కసరత్తు చేస్తోంది.
నాన్ ఆయకట్టు ఏరియాల పైనే ఫోకస్...
పారిశ్రామిక కారిడార్ల ఏర్పాటుకు భూముల సేకరణ ప్రధాన అడ్డంకిగా మారింది. ఆయకట్టు ప్రాంతాల్లో భూముల ధరలు భారీగా ఉండటంతో మిర్యాలగూడ, నాగార్జునసాగర్, కోదాడ నియోజకవర్గాల్లో ఇండ్రస్ట్రియల్ పార్క్‌లు ప్రతిపాదనలు ముందుకు కదలడం లేదు. ఇటీవల మిర్యాలగూడ నియోజకవర్గంలో ఆలగడపలో ప్రతిపాదించిన ఇండ్రస్ట్రియల్ పార్క్ రైతు లు అడ్డుకోవడంతో ఆగిపోయింది. ఆలగడపలో భూముల ధరలు కోట్లు పలుకుతుండటంతో అక్కడి రైతులు ఇండ్రస్ట్రీ వద్దని పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. కొందరు రైతులు భూసేకరణకు వ్యతిరేకంగా కోర్డును ఆశ్రయిం చడంతో ఆలగడప ప్రతిపాదన ఆగిపోయింది. దీంతో నాన్ ఆయకట్టు ఏరియాల పైన అధికారులు దృష్టి పెట్టారు. ఎక్కడ కొద్దిపాటి భూములు దొరి కినా ఆ ప్రాంతాన్ని పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక లు రూపొందిస్తున్నారు.
హైవేలకు దగ్గరగా పార్క్‌లు...
జాతీయ, రాష్ట్ర రహాదారులకు సమీపంలోనే కొత్త ఇండ్రస్ట్రియల్ పార్క్‌లు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్–విజయవా డ ప్రధాన జాతీయ రహదారి, నార్కట్‌పల్లి టు అద్దంకి, మాచర్ల – హైద రాబాద్, కోదాడ టు జడ్చర్ల, హైదరాబాద్ టు వరంగల్ హైవే సమీపంలోని మండలాల్లో భూముల సేకరణ జరుగుతోంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు మండలాల్లో భూములు సేకరణ పూర్తికాగా, ఇంకొన్ని చోట్ల అసైన్డ్ భూముల స్వాధీనం చేసుకునేందుకు నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది. నల్గొం డ, దేవరకొండ, ఆలేరు, హుజూర్నగర్, నకిరేకల్ నియోజకవర్గాల్లో కొత్త ఇండ్రస్ట్రియల్ పా ర్క్‌లు ప్రతిపాదించారు.
పార్క్‌లు ప్రతిపాదిత ప్రాంతాలు ...
నల్గొండ సమీపంలోని తిప్పరి మండలం కేశరాజుపల్లిలో 11 ఎకరాలు, కొండమల్లేపల్లి మం డలం కోల్‌ముంతల్‌పహాడ్ లో 240 ఎకరాలు, నల్గొండ మండలం అన్నెపర్తి వద్ద 30 ఎకరాలు, చింతపల్లి మండలం నర్సర్లపల్లి వద్ద 80 ఎకరాలు, ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి వద్ద 150 ఎకరాలు, నేరేడుచర్లలో ఆటోనగర్ కోసం 11 ఎకరా లు, చిట్యాల మండలం వెలిమినే డు వద్ద 450 ఎ కరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ ఏర్పాటు కానుంది. అయితే ఇండ్రస్ట్రియల్ పార్క్‌ల ఏర్పాటు వేగవంతం కావాలంటే ప్రభుత్వం వీలైనంత త్వరగా ఫండ్స్ రిలీజ్ చేయాలి. రోడ్లు, కరెంట్, ఇతర మౌలిక సదుపాపాయాల కల్పనకు ప్రభుత్వం ఫండ్స్ ఇస్తేనే పార్క్‌లను త్వరగా డెవలప్ చేయడానికి వీలవుతుంది.