
‘‘మగాళ్ల రక్షణకు కూడా ఒక చట్టం ఉండి ఉంటే నేను ఇలా ఆత్మహత్య చేసుకునే వాడిని కాదు. నా చావు తర్వాత కూడా నాకు న్యాయం జరగకపోతే నా అస్థికలను తీసుకెళ్లి డ్రైనేజీలో కలపండి’’.. ఇదీ ఉత్తరప్రదేశ్లో ఆత్మహత్య చేసుకున్న ఒక భార్యా బాధితుడు సెల్ఫీ వీడియోలో.. చివరి క్షణాల్లో చెప్పిన మాటలు. నోయిడాకు చెందిన ఫీల్డ్ ఇంజినీర్ మోహిత్ కుమార్ సెల్ఫీ వీడియో రికార్డ్ చేసిన అనంతరం ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. తన భార్య, ఆమె కుటుంబం పెడుతున్న చిత్రహింసలు తట్టులేకపోతున్నానని.. భార్య రోజురోజుకూ నరకం చూపిస్తుందని మోహిత్ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు.
7 years of relationship.
— Thara Bhai Narinder (@NarinderMudii) April 20, 2025
Wife miscarriages the baby after getting a govt job.
Files fake dowry case.
Demands all the assets.
Husband commits suicide, asks for the ashes to be thrown in gutter if he does not get justice.pic.twitter.com/yPfj31PIow
ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్లోని ఔరయా జిల్లాకు చెందిన మోహిత్, ప్రియా యాదవ్ కొన్నేళ్ల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లయిన కొన్నేళ్లు అన్యోన్యంగానే ఉన్నారు. ప్రియకు బీహార్ సమస్తిపూర్లో ప్రైమరీ టీచర్గా ఉద్యోగం వచ్చింది. టీచర్గా ఉద్యోగం వచ్చిన తర్వాత ప్రియ ప్రవర్తనలో పూర్తిగా మార్పు వచ్చిందని మోహిత్ కుటుంబం చెప్పింది. మోహిత్ను మానసికంగా వేధించిందని.. చివరకు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి తీసుకొచ్చిందని అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ప్రియతో పాటు ఆమె తల్లి, అన్నయ్య కూడా మోహిత్ను టార్చర్ చేశారని అతని తల్లిదండ్రులు తెలిపారు.
మోహిత్ కూడా అతను రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో ఇదే చెప్పాడు. తన భార్య ప్రియ యాదవ్ వద్దంటున్నా వినకుండా అబార్షన్ చేయించుకుందని.. అంతేకాకుండా ఇంట్లో ఉన్న నగలు, డబ్బు తీసుకుని తన వద్దే ఉంచుకుందని మోహిత్ చెప్పుకొచ్చాడు. తన పేరును ఇల్లు, ఆస్తి రాసివ్వకపోతే వరకట్న వేధింపుల కేసు పెడతానని తనను, తన కుటుంబాన్ని బెదిరించిందని వీడియోలో మోహిత్ ఆవేదన వ్యక్తం చేశాడు. భార్య పెట్టిన టార్చర్ వల్ల ఇప్పటికే తాను అలసిపోయానని, ఇకపై ఇలా బతకలేనని మోహిత్ ఆ వీడియోలో చెప్పాడు.
తను చనిపోయిన తర్వాత కూడా న్యాయం జరగకపోతే తన అస్థికలను తీసుకెళ్లి డ్రైనేజీలో కలపాలని మోహిత్ కన్నీటిపర్యంతమయ్యాడు. ఈ నిర్ణయం తీసుకున్నందుకు అమ్మా, నాన్న క్షమించాలని.. మీరు ఆశించినట్టుగా బతకలేకపోయానని పశ్చాతాపం వ్యక్తం చేసిన మోహిత్ ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. మోహిత్ నోయిడాలోని ఒక సిమెంట్ కంపెనీలో ఫీల్డ్ ఇంజినీర్గా పనిచేసేవాడు. మోహిత్ మృతదేహాన్ని ఎత్వా రైల్వే స్టేషన్ సమీపంలోని జాలీ హోటల్లోని రూమ్ నెంబర్ 105లో పోలీసులు గుర్తించారు.