మరోసారి రోడ్డెక్కిన శేజల్

మరోసారి రోడ్డెక్కిన శేజల్
  • మరోసారి రోడ్డెక్కిన శేజల్
  • శేజల్, చిన్నయ్య అనుచరుల మధ్య అర్ధరాత్రి గొడవ
  • ఇరువురిపై  హత్యాయత్నం కేసు నమోదు

బెల్లంపల్లి :  కొంతకాలంగా రాష్ట్రవ్యాప్తంగా సంచనలం రేకెత్తిస్తున్న శేజల్, చిన్నయ్యల గొడవ మరోసారి రోడ్డెక్కింది. సోమవారం అర్ధరాత్రి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ఆరిజిన్ డెయిరీ సిఈఓ శేజల్, మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అనుచరుల మధ్య  తీవ్రస్థాయిలో ఘర్షణ జరిగింది. బెల్లంపల్లి రూరల్ పోలీసులు తెలిపిన ప్రకారం మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఇంటికి శేజల్, ఆదినారాయణ  వెళ్లి గొడవ చేశారు. చిన్నయ్యను కులం పేరుతో దూషిస్తుండగా మాజీ ఎమ్మెల్యే అనుచరులైన బీమా శంకర్ తో పాటు మరో ఇద్దరు అలా తిట్టవద్దని సూచించారు. 

ఈ క్రమంలో  మాజీ ఎమ్మెల్యే అనుచరులతో శేజల్, ఆదినారాయణల గొడవ పడ్డారు. ఒకరినొఒకరు కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో శేజల్ కు చెందిన కారు అద్దాలు పగిలాయి. ఘటనపై తాళ్ల గురజాల పోలీస్​ స్టేషన్​లో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఇచ్చిన ఫిర్యాదు చేసుకున్నాయి.  ఇరువురిపై పోలీసులు  హత్యాయత్నం కేసు నమోదు చేశారు. శేజల్, ఆదినారాయణ పై 307 IPC SC /ST చట్టం క్రింద కింద కేసు నమోదు చేశారు. దుర్గం చిన్నయ్య అనుచరుల మీద 307, 427, రెడ్​విత్​ 34 IPC కేసులు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ రాజ్ కుమార్ తెలిపారు.