అన్నదమ్ముల మధ్య ఆస్తి తగదాలు..ఒకరు మృతి

రంగారెడ్డి జిల్లా : మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆస్తి తగాదాలు ఒకరి ప్రాణం తీశాయి. ఆస్తి పంపకాల్లో తేడాలు రావటంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై మరొకరు ఇటుకలు, రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తన సోదరుడు జాబెర్ చేతిలో అబ్దుల్లా చనిపోయాడు. జాబెర్ కు కూడా తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు.

మరోవైపు గొడవ జరుగుతుండగా అడ్డువచ్చిన ఓ మహిళపైనా దాడి చేశారు. ఈ ఘటన షమాకాలనీలో జరిగింది. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.