వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ కె.యల్ రాహుల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 86 బంతుల్లో ఒక్క ఫోర్ తో రాహుల్ తన హాఫ్ సెంచరీ చేసి టీమిండియాను గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నాడు. పిచ్ నెమ్మదిగా ఉండడంతో ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్న రాహుల్ క్రీజ్ లో ఎంతవరకు ఉంటాడనే దానిపై విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి.
81 పరుగుల వద్ద 3 వికెట్లు కోల్పోయిన భారత్ ను రాహుల్, కోహ్లీ 67 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకునే ప్రయత్నం చేశారు. 148 పరుగుల వద్ద కోహ్లీ(54) ఆ తర్వాత జడేజా (9) త్వరగా అవుట్ కావడంతో భారత్ ప్రస్తుతం 36 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజ్ లో రాహుల్ (55), సూర్య(0) క్రీజ్ లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ(47) ఎప్పటిలాగానే వేగంగా ఆడి భారత్ కు మెరుపు ఆరంభాన్ని ఇస్తే గిల్(4), ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్(4) తక్కువ పరుగులకే ఔటయ్యారు.
FIFTY BY KL RAHUL IN THE FINAL...!!!
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
A fine half century by KL - came in when two wickets fell quickly. He's going well, a strong finish needed. pic.twitter.com/VLk7YcZnkE