- ఆన్‌లైన్‌లో తప్పుడు సెల్ఫ్ అసెస్‌మెంట్ ఇచ్చినందుకే..
జీడిమెట్ల, వెలుగు: ఆన్‌లైన్‌లో తప్పుడు సెల్ఫ్ అసెస్‌మెంట్‌కు దరఖాస్తు చేసుకున్న ఓ హాస్సిటల్‌కు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రూ.24 కోట్ల జరిమానా విధించారు. నిజాంపేట్‌లోని ఎస్‌ఎల్‌జీ ఆసుపత్రి 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో రెండు సెల్లార్స్, జీ ప్లస్ 9 అంతస్తుల్లో ఉంది. ఆసుపత్రి మొత్తం 10 లక్షల చదరపు అడుగులు ఉండగా, నాలుగు అంతస్తుల్లో 32,300 చదరపు అడుగు లకే ఆన్‌లైన్ ద్వారా సెల్ఫ్ అసెస్‌మెం ట్‌కు దరఖాస్తు చేశారు. అయితే, నిజాంపేట్ అధికారుల విచారణలో ఆ వివరాలు తప్పుగా ఉన్నాయని తేలింది. మున్సిపల్ చట్టం ప్రకారం.. సెల్ఫ్ అసెస్‌మెంట్‌లో ఇచ్చిన వివరాలు తప్పుగా ఉంటే 25 రేట్లు జరిమానా వేసే అధికారం అధికారులకు ఉంది. దీంతో ఆ హాస్పిటల్ ఏడాదికి కట్టే ట్యాక్స్‌పై 25 రేట్లు ఫైన్ వేయగా, రూ.24 కోట్ల జరిమానా పడింది.