టర్కీ రాజధాని ఇస్తాంబుల్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మంగళవారం 16 అంతస్థులు గల బిల్డింగ్ లో గ్రౌండ్, బేస్మెంట్ ఫ్లోర్లలో మంటలు చెలరేగాయి. పునర్నిర్మాణంలో ఉన్న మాస్వ్కెరేడ్ నైట్ క్లబ్ లో అగ్ని ప్రమాదం జరిగింది. బిల్డింగ్ రికస్టక్చషన్ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. ఈ భారీ అగ్ని ప్రమాదంలో 26 మంది చనిపోయినట్లు ఒక వ్యక్తి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నట్లు అధికారులు తెలిపారు.
సంఘటన ప్రదేశానికి ఫైర్ ఇంజన్లు చేరుకొని మంటలను అర్పివేశారు. క్లబ్ యజమానితోపాటు మరో ఐదుగురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇస్తాంబుల్ గవర్నర్ దావత్ గుల్ సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మంటలు చెలరేగడానికి గల కారణాలను అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ :- ఏప్రిల్ 9 నుంచి చైత్ర నవరాత్రిళ్లు ప్రారంభం.. 30 ఏళ్ల తర్వాత అమృత సిద్ధి యోగం