
అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియం సమీపంలోని స్ర్కాప్ దుకాణంలో శుక్రవారం అగ్నిప్రమాదం జరిగింది. మహ్మద్ ఖాజాకు చెందిన దుకాణంలో ఒక్కసారిగా మంటలు ఎగిసి పడడంతో పాత వాహనాలు, ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. ఫైర్ ఆఫీసర్లు అక్కడికి చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చారు. రూ.3 లక్షల ఆస్థి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు.