విశాఖ నగరంలోని జగదాంబ కూడలి సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇండస్ ఆస్పత్రిలోని మొదటి అంతస్తు ఆపరేషన్ థియేటర్‌లో మంటలు వ్యాపించాయి. దీంతో ఆ తర్వాత మిగిలిన అంతస్తులకు పొగలు వ్యాపించాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అగ్నిప్రమాదంతో ఇండస్ ఆస్పత్రి ఆవరణలో దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. పైఅంతస్తుల్లోని కొంతమంది రోగులను నిచ్చెనల సహాయంతో కిందికి తీసుకొచ్చారు. ఈ ప్రమాదంతో రోగులు, వారి బంధువులు భయభ్రాంతులకు గురయ్యారు.
ఈ ఘటన షార్ట్ సర్క్యూట్‌తో జరిగినట్లు భావిస్తున్నారు. దీనిపై పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ చేపట్టారు.