కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం డేగలమడుగు గ్రామంలోని మంజిత్ కాటన్ మిల్లులో అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. మంటల్లో పత్తి విత్తనాలు భారీగా తగలబడుతున్నాయి. మంటలను కాటన్ మిల్లు సిబ్బంది ఆర్పివేసే ప్రయత్నాలు చేస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పివేసే ప్రయత్నం చేస్తున్నారు. ప్రమాదం జరిగిన స్థలంలో పొగలు దట్టంగా అలుముకున్నాయి.