కూకట్ పల్లిలో అర్ధరాత్రి అగ్నిప్రమాదం..3 బస్సుల దగ్ధం

హైదరాబాద్ : కూకట్ పల్లిలోని పార్క్ షేడ్స్ లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. పార్కింగ్ చేసి ఉన్న మూడు బస్సుల్లో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో భారతి ట్రావెల్స్ కు చెందిన 3 బస్సులు పూర్తిగా దగ్ధమయ్యాయి. విషయం తెలియగానే ఫైర్ ఇంజన్లు ఘటనాస్థలానికి చేరుకుని.. మంటలను ఆర్పివేశాయి. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.