పెద్దపల్లి జిల్లా : పెద్దపల్లి మండలం అప్పన్నపేట శివారులో ఉన్న SRR ఫైర్ వర్క్ లో అగ్నిప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసే ప్రయ్నతం చేస్తున్నారు. అయితే.. చాలాసేపు నుంచి మంటలను ఆర్పి వేస్తున్నా.. అదుపులోకి రావడం లేదు. మరోవైపు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.
అగ్నిప్రమాదం జరిగిన SRR ఫైర్ వర్క్ లో బాంబులు, రాఖీలను తయారు చేస్తారని చెబుతున్నారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతుండడంతో పెద్దపల్లి, మంథని, రామగుండం నుండి కూడా ఫైర్ ఇంజన్లను తెప్పించారు. సంఘటన స్థలాన్ని పెద్దపల్లి ఏసీపీ సారంగపాణి, సీఐ ప్రదీప్ కుమార్, పెద్దపల్లి, బసంత్ నగర్ ఎస్ ఐలు రాజేష్, శ్రీనివాస్ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. భారీ అగ్ని ప్రమాదం జరగడంతో యజమానులు ఇల్లందుల కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.