జగిత్యాల జిల్లా: రైస్ మిల్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించి కోట్ల రూపాయలు నష్టం వాటిల్లింది. జగిత్యాల జిల్లా బీమారం మండలంలోని దేశాయిపేటలో విఘ్నేశ్వర రైస్ ఇండస్ట్రీస్‌లో ఆదివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైస్ మిల్లులో నిల్వ చేసిన ధాన్యం కాలిపోయి సుమారు రూ.4 కోట్ల 40లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. అగ్ని ప్రమాదానికి కారణం విద్యుత్ షాక్ సర్క్యూట్. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు చేరుకొని మంటలను ఆర్పి వేశారు. సంఘటన స్థలానికి చేరుకున్న సివిల్ సప్లై అధికారులు, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.