హైదరాబాద్: సికింద్రాబాద్ పరిసర ప్రాంతంలోని ప్యారడైస్ సమీపంలోని ఓ బార్ అండ్ రెస్టారెంట్ లో అగ్ని ప్రమాదం సంభవించింది. భగార బార్ అండ్ రెస్టారెంట్ కిచెన్ లో మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం ఒక్కసారిగా పొగ కమ్ముకుంది. వెంటనె బార్ లో ఉన్న కస్టమర్స్ భయంతో బయటకు పరుగులు తీశారు. సిబ్బంది బార్ మూసివేసి ఫైర్ స్టేషన్ కు సమాచారం ఇవ్వగా.. ఫైర్ సిబ్బంది ప్రమాద స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేశారు. వెంటనే గమనించడంతో పెను ప్రమాదం తప్పింది.