ఏపీలో భారీ అగ్నిప్రమాదం జరగింది. తెల్లవారు జామున తిరుపతి జిల్లాలోని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు స్లీపర్ ట్రావెల్స్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. బెంగళూరు నుంచి అమలాపురం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సు నుంచి బయటకు పరుగులు తీశారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటల్ని ఆర్పివేశారు. ప్రమాద సమయంలో బస్సులో 12 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ అప్రమత్తం కావడంతో ఎటువంటి ప్రాణాపాయం కాలేదు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.