హైటెక్స్ నుంచి జేఎన్టీయూ వెళ్లే దారిలో అర్ధరాత్రి ఓ కారులో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. మాదాపూర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సైబర్ టవర్స్ నుంచి జేఎన్టీయూ వైపు వెళ్తున్న (టీఎస్10 ఈఈ 3363) ఐ 20 కారులో జూన్ 9న రాత్రి 10.30 గంటలకు యశోదా హాస్పిటల్ రాగానే ఇంజిన్నుంచి పొగలు వచ్చాయి.
కారు డ్రైవ్ చేస్తున్న వ్యక్తి గమనించి వెంటనే కిందకు దిగాడు. ఈ క్రమంలో మంటలు కారు మొత్తం వ్యాపించాయి. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. కారు యజమాని వివరాలు ఇంకా తెలియరాలేదు.