హైదరాబాద్ పీవీఎన్‌‌ఆర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై కారు దగ్ధం

హైదరాబాద్ పీవీఎన్‌‌ఆర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌వేపై కారు దగ్ధం

గండిపేట్, వెలుగు: రాజేంద్రనగర్​లోని పీవీఎన్‌‌ఆర్‌‌ ఎక్స్‌‌ప్రెస్‌‌ వేపై రన్నింగ్ ​కారులో  మంగళవారం మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.  పొగల్ని గమనించిన డ్రైవర్‌‌ కారులోంచి వెంటనే కిందకు దిగడంతో పెను ప్రమాదం తప్పింది. నిమిషాల వ్యవధిలో కారు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ ఘటనతో ఎక్స్‌‌ప్రెస్‌‌ వేపై చాలా సేపు ట్రాఫిక్‌‌ స్తంభించింది.