రాయికల్, వెలుగు: జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కుమ్మరిపల్లి గ్రామంలోని ఓ కోళ్లఫామ్‌లో శుక్రవారం సాయంత్రం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విలువైన కలప, 5వందల గడ్డికట్టలు(పశుగ్రాసం), కోళ్లఫామ్ సామగ్రి కాలిపోయింది. ఫైర్ స్టేషన్‌కు స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను ఆర్పేశారు. షెడ్డులో కోళ్లు లేకపోవడంతో పశువుల పాకగా వినియోగించుకుంటున్నామని, పశువులు మేతకు వెళ్లడంతో ప్రమాదం తప్పిందని బాధిత రైతు తెలిపారు.
కాగా చుట్టుపక్కల పొలాల్లో కొందరు రైతులు వరి కొయ్యలకు నిప్పు పెట్టగా.. ప్రమాదం జరిగినట్లు పలువురు భావిస్తున్నారు. ఘటనాస్థలిని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి తనయుడు రాంచంద్రారెడ్డి, లీడర్లు కొయ్యడి మహిపాల్, దివాకర్, భూమయ్య, తిరుపతిరెడ్డి పరామర్శించారు.