కుత్బుల్లాపూర్: హైదరాబాద్ నగరంలోని చాక్లెట్ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధి భాగ్యలక్ష్మి కాలనీలోని గోకల్ దాస్ చాక్లెట్ తయారీ కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. చాక్లెట్ పౌడర్ ను వేడి చేసే క్రమంలో గ్యాస్ లీకేజి కావడంతో దట్టమైన పొగలతో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి పోలీసులు, ఫైర్ ఇంజన్ సిబ్బంది వెంటనే చేరుకున్నారు. ఫైర్ సిబ్బందికి స్థానికులు సహాయం చేసి మంటలను ఆర్పారు.
చాక్లెట్ కంపెనీ ఇళ్ళ మధ్యలో ఉండటంతో చుట్టుపక్కల స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆస్తి నష్టం ఎంత మేరకు వాటిల్లిందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పెట్ బషీరాబాద్ పోలీసులు.