రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గగన్ పహాడ్ పారిశ్రామిక వాడలోని ఓ ధర్మకోల్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రస్తుతం భారీగా మంటలు ఎగిసిపడుతుండడంతో దట్టమైన నల్లని పొగ అవహించింది. కిలో మీటర్ల దూరం వరకు నల్లని పొగ వ్యాపించింది.
శంషాబాద్ ఎయిర్ పోర్టు పోలీస్ స్టేషన్ పరిధిలోని రంగోలి ఈపీఎస్ ధర్మకోల్ కంపెనీలో అగ్ని ప్రమాదం జరిగింది. విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుంది. ప్రస్తుతం మంటలను ఆర్పివేస్తున్నారు అగ్నిమాపక సిబ్బంది.
దాదాపు రూ.2 కోట్ల మిషనరీ, ముడి సరుకు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. కంపెనీ యజమాని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అసలు ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై విచారణ చేయనున్నారు.