హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని ఓ అపార్ట్‌మెంట్‍లోని ఫ్లాట్‌లో శుక్రవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. అల్వాల్ ప్రాంతంలోని మచ్చ బొల్లారంలోని విబిసిటీ అపార్ట్‌మెంట్‍లో ఐదవ అంతస్తులో అగ్నిప్రమాదం జరిగింది. ఫ్లాట్ లోని సామాగ్రి అంతా పూర్తిగా కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే ప్లాట్ లో వస్తువులన్నీ దగ్ధమైయ్యాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.