హనుమకొండ జిల్లా కమలాపూర్ ఎల్లమ్మగుడి, గ్యాస్ రీ ఫిల్లింగ్ ప్లాంట్ సమీపంలోని తాటి వనంలో అగ్నిప్రమాదం జరిగింది. వరి కుప్పలు, పశుగ్రాసం, తాటి చెట్లు, మోటార్ల వైర్లు, పైపులు, టేకు చెట్లు పూర్తిగా మంటల్లో దగ్ధమయ్యాయి. దాదాపు 20కిపైగా తాటి చెట్లు మంటల్లో కాలి బూడిదయ్యాయి. స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ.. అప్పటికే నష్టం జరిగిపోయింది.
అగ్ని ప్రమాదం జరిగిన వరి పొలం కమలాపూర్ కు చెందిన కిషన్ అనే రైతుది. 30 గుంటల పొలంలో వరికుప్పలు కూడా పూర్తిగా కాలిపోయాయి. దాదాపు రూ.30 వేల వరకూ నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీటి పర్యంతమవుతున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు.