
రన్నింగ్కారులో మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లాలో ఆగస్టు 24 అర్ధరాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కారుతో వస్తున్న పలువురు హస్తినాపురంలోని పద్మావతి నగర్‌కి రాగానే వాహనంలో కాలుతున్న వాసన వచ్చింది.
అప్రమత్తమైన డ్రైవర్, ప్రయాణికులు వెంటనే కారు దిగి బయటకి వచ్చారు. మంటలు చెలరేగి క్షణాల్లో కారు అగ్నికి ఆహుతి అయింది. ప్రయాణికులు సేఫ్‌గా బయటపడ్డారు.