రన్నింగ్ ఆర్టీసీ బస్సులో గురువారం (అక్టోబర్ 24) మంటలు చెలరేగాయి. కాసేపట్లోనే బస్సు పూర్తిగా కాలిపోయింది. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. తమిళనాడు కోయంబత్తూర్ లో ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. కొయంబత్తూర్ నుంచి పొలాచ్చి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
Also Read :- కాశ్మీర్లో వలస కార్మికులపై మరోసారి ఉగ్రదాడి
ఆ టైంలో బస్సులో 25 మంది ప్రయాణీకులు ఉన్నారు. అప్రమత్తంగా వ్యవహరించి డైవర్ వెంటనే బస్సు రోడ్డుపై పక్కకు ఆపి.. ప్రయాణికులను దించాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఎవ్వరికీ ఎలాంటి ప్రమాదం కాకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆర్టీసీ బస్సు పూర్తిగా కలిపోయింది. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు.