
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: నాగర్ కర్నూల్ మండలం గగ్గలపల్లి శివారులోని సోలార్ ప్లాంట్లో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. ప్లాంట్ ఆవరణలో ఉన్న గడ్డికి నిప్పు అంటించడంతో మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో రూ. 9 లక్షల విలువైన సోలార్ పరికరాలు దగ్ధమయ్యాయి. స్థానికులు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ స్టేషన్ ఆఫీసర్ కృష్ణమూర్తి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అర్పివేశారు.