ఐస్ క్రీమ్ గోడౌన్ లో అగ్ని ప్రమాదం

హైదరాబాద్ : ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. వెంగళరావునగర్ కాలనీలో ఉన్న అమూల్ ఐస్ క్రీమ్ గోడౌన్ లో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి. విషయం తెలియగానే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. పెద్ద ఎత్తున మంటలు గోడౌన్ లో వ్యాపించడంతో ఆర్పేందుకు కాస్త కష్టతరమైంది. జనావాసాల మధ్యన ఉన్న గోడౌన్ లో ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేదని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది త్వరగా చేరుకొని మంటలను అదుపు చేయడంతో ఎటువంటి ప్రాణానష్టం జరగలేదు.