హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో  జియానిస్ ఐస్ క్రీమ్ పార్లర్ లో మంటలు చెలరేగాయి. ఏసీ షార్ట్ సర్క్యూట్ తో మంటలు భారీగా వ్యాపించాయి. విషయం తెలియగానే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు. చుట్టుపక్కల ప్రాంతాలకు దట్టమైన పొగలు కమ్మేయడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదంపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.