న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో కార్చిచ్చు.. మంటలు చెలరేగడంతో హైవే క్లోజ్

న్యూయార్క్‌‌‌‌‌‌‌‌లో కార్చిచ్చు.. మంటలు చెలరేగడంతో హైవే క్లోజ్

న్యూయార్క్‌‌‌‌: అమెరికాలోని న్యూయార్క్‌‌‌‌ రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగింది. శనివారం లాంగ్ ఐలాండ్‌‌‌‌లోని వెస్ట్‌‌‌‌ హోంప్టన్‌‌‌‌ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. అలాగే, మరో మూడు ప్రాంతాల్లో కూడా మంటలు అంటుకున్నాయి. ఈస్ట్‌‌‌‌ న్యూయార్క్‌‌‌‌ ప్రాంతంలోని పైన్‌‌‌‌ బారెన్స్‌‌‌‌, దాని చుట్టు పక్కల ప్రాంతాలకూ మంటలు వ్యాపించాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగ అలుముకుంది. హైవేకు దగ్గర్లో మంటలు చెలరేగడంతో ప్రధాన రహదారిని మూసివేశారు.