
కూకట్ పల్లిలోని ఏఎస్ రాజు నగర్ లోని ఓ కారు(టీఎస్ 07 హెచ్ ఏ 5455) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. గమనించిన స్థానికులు మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కేపీహెచ్బీ ఉషా ముల్లపూడి కమాన్ నుంచి కూకట్ పల్లి వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.