ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. భయంతో పరుగులు తీసిన రోగులు

నల్లగొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం జరిగింది. మాతా శిశు ఆరోగ్య కేంద్రంలోని స్టోర్ రూంలో షాట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. రూమ్ లో ఉన్న బ్లీచింగ్ పౌడర్ మండడంతో పొగలు అలుముకున్నాయి. ఇది గమనించిన రోగులు, వారి సహాయకులు పిల్లలతో సహా భయంతో బయటకు పరుగులు తీశారు. 

వెంటనే ఆస్పత్రి సిబ్బంది అలర్ట్ అయ్యారు. పొగలు బయటకు వెళ్లేందుకు కిటికీల అద్దాలను ధ్వంసం చేశారు. మంటలను ఆర్పివేయడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆస్పత్రి సిబ్బంది వెల్లడించారు.