సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదురుగా అగ్నిప్రమాదం

హైదరాబాద్ : సికింద్రాబాద్ రైల్ నిలయం ఎదురుగా ఉన్న పాత రైల్వేక్వార్టర్స్ లో అగ్ని ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.

గత కొన్ని సంవత్సరాలుగా రైల్వేక్వార్టర్స్ ఖాళీగా ఉంటున్నాయి. దీంతో అక్కడ చెత్తా చెదారంపేరుకుపోయింది. గుర్తు తెలియని ఓ వ్యక్తి సిగరెట్ తాగి పడేయడం వల్లే అగ్నిప్రమాదం జరిగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. చుట్టుపక్కల ఖాళీ ప్రాంతం కావడంతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అగ్నిప్రమాదం జరిగిన కూతవేటు దూరంలోనే రైల్వే సంచాలన్ భవనం ఉంది.