మణికొండలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఐపీఎల్ అపార్ట్ మెంట్ 9వ అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కొత్తగా కొనుగోలు చేసిన ప్లాట్లో గృహప్రవేశం చేసిన యజమాని దేవుడి గదిలో దీపం పెట్టారు. అయితే దీపం దగ్గర ఉన్న కాటన్ అంటుకుని పూజగది తగలడబడిపోయింది. పక్కనే కిచెన్ కు మంటలు వ్యాపించడంతో ఇంటిరియల్ డిజైన్ కాలిపోయింది. దీంతో ఫ్లాట్ మొత్తం మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు రావడంతో భయంతో పరుగులు తీశారు అపార్ట్ మెంట్ వాసులు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు నార్సింగి పోలీసులు.
హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు బెంబేలెత్తిస్తున్నాయి. నవంబర్ 25న రాత్రి జీడిమెట్లలో భారీగా అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే.నవంబర్ 26న ఉదయం రామంతాపూర్ లో బైక్ లు దగ్ధం.. ఇలా రోజుకో చోట అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.