చెర్వుగట్టు దేవాలయంపై మంటలు

నార్కట్​పల్లి,వెలుగు: నార్కట్​పల్లి మండలంలోని చెర్వుగట్టు గ్రామంలోని శ్రీపార్వతి జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం గుట్ట పై  మంగళవారం మంటలు చెలరేగాయి. దీంతో భక్తులు అందోళన చెందారు. కాలభైరవుని దేవాలయం సమీపాన ఉన్న చెత్తలో సాయంత్రం ప్రమాదవశాత్తు మంటలు  వచ్చాయి.  

భక్తులు, దుకాణదారులు మంటలను అర్పేందుకు కృషి చేశారు. దేవాలయ ఈవోకు దుకాణదారులు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. ఈవో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి  తెచ్చారు.