ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో పట్టపగలు నడిరోడ్డుపై కాల్పులు జరిగాయి. నేవీ ముంబైలోని సన్పద ప్రాంతంలోని డీమార్ట్ ఔట్ లెట్ ముందు ఈ కాల్పులు జరిగాయి. బైక్పై వచ్చిన ఇద్దరు దుండగులు రాజరాజ్ థోకే అనే చెత్త కలెక్ట్ చేసే ఏజెన్సీ కాంట్రాక్టర్పై కాల్పులు రిపారు. డీమార్ట్ దగ్గర కారు ఆపి.. కారులో కూర్చుని టీ తాగుతుండగా అతనిపై కాల్పులు జరిపారు. నాలుగు నుంచి ఐదు రౌండ్ల కాల్పులు జరిపారు. క్లోజ్ రేంజ్ లో కాల్పులు జరపడంతో బాధితుడు తీవ్రంగా గాయపడ్డాడు. హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
— IANS (@ians_india) January 3, 2025
పోలీసులు విషయం తెలుసుకుని క్రైం బ్రాంచ్కు కూడా సమాచారం అందించారు. కాల్పులు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి విచారణ మొదలుపెట్టారు. కాల్పులు జరిపి అక్కడ నుంచి బైక్పై పారిపోయారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం గాలిస్తున్నారు. డీమార్ట్ ముందే ఈ ఘటన జరగడంతో కస్టమర్లు బెంబేలెత్తిపోయారు. చుట్టు పక్కల వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్లంతా షాక్కు లోనయ్యారు.