హయత్ నగర్ లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. స్కూల్ వెళ్లిన పిల్లవాడు ఇంటికి శవమై చేరాడు. హయత్ నగర్ MPP గవర్నమెంట్ స్కూల్లో కాంపోండ్ వాల్ గేట్ ఊడిపడి 1వ తరగతి విద్యార్థి అజయ్ మీద పడింది. స్కూల్లో ఆడుకుంటుండగా ఇది జరిగిందని తోటివిద్యార్థులు చెప్తున్నారు. మెయిన్ గేట్ చాలా రోజులుగా బలహీనంగా ఉందని.. స్కూల్ కు వాచ్మెన్ కూడా లేడు.
ఆరేళ్ల అలకంటి అజయ్ ఆడుకుంటున్న సమయంలో స్కూల్ మెయిన్ గేట్ ఒక్కసారిగా పడింది. తీవ్ర రక్తస్రావమై బాబు చనిపోయాడు. గవర్నమెంట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లనే విషాదం చోటుచేసుకుందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించాలని స్థానిక కార్పొరేటర్ జీవన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.