భద్రాచలం, వెలుగు : భద్రాచలం జూనియర్ కాలేజీ పూర్వ విద్యార్థి ఎన్ఆర్ఐ డాక్టర్తాళ్లూరి జయశేఖర్ రూ.50లక్షల విరాళాన్ని అందజేశారు. బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన జయశేఖర్ భద్రాచలం జూనియర్ కాలేజీలో చదివారు. కాలేజీకి నూతన భవన నిర్మాణానికి రూ.కోటి ఖర్చు అవుతుంది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు రూ.50లక్షలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయగా, వాటికి సమాంతరంగా జయశేఖర్ రూ.50లక్షలు ఇచ్చారు. ఈ మేరకు శనివారం కాలేజీలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాలేజీ ప్రిన్సిపల్ కృష్ణవేణికి తన అనుమతి పత్రాన్ని అందజేశారు.
ఎమ్మెల్యేకు ఏఎంసీ కాలనీవాసుల వినతి
మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్రాజ్ ఆధ్వర్యంలో భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ నిరుపేదలు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. తమకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అనంతరం
ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు.