సిద్దిపేట రూరల్, వెలుగు : తాను చదువుకున్న స్కూల్కు ఏటా లక్ష రూపాయలు అందజేస్తానని ఓ పూర్వ విద్యార్థి ఉదారత చాటాడు. సిద్దిపేట అర్బన్ మండలం తడకపల్లి గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ లో గురువారం 78వ స్వాతంత్ర వేడుకలు హెచ్ఎం దేవర కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అదే స్కూల్లో చదువుకున్న 1995,1996 బ్యాచ్ విద్యార్థి ఎన్సాన్ పల్లి గ్రామానికి చెందిన జెట్టి మల్లేశం హాజరయ్యారు.
ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా తాను చదువుకున్న స్కూల్కు తన వంతు సహకారం అందిస్తానని స్కూల్లో మౌలిక వసతుల కోసం ఏటా రూ. లక్ష నగదు అందిస్తానని మల్లేశం ప్రకటించారు.