విద్యుత్ షాక్​తో నాలుగేండ్ల బాలుడు మృతి

ఆసిఫాబాద్, వెలుగు : విద్యుత్ షాక్​తో నాలుగేళ్ల బాలుడు చనిపోయాడు. ఈ ఘటన ఆసిఫాబాద్​ జిల్లా వాంకిడి మండలం ఖిరిడి గ్రామంలో శనివారం జరిగింది. గ్రామానికి చెందిన చౌదరి సరిత, సోమయ్య దంపతులకు ఇద్దరు కొడుకులు. శనివారం మధ్యాహ్నం సరిత బోర్ ఆన్ చేసి దుస్తులు ఉతుకుతుండగా పెద్ద కొడుకు చౌదరి రిషి కుమార్ (4) వచ్చి బోర్​కు ఉన్న ఇనుప పైప్​ను పట్టుకున్నాడు.

విద్యుత్ షాక్ తో విలవిలలాడుతుండగా గమనించిన సరిత వెంటనే బోర్ ఆఫ్ చేయడంతో రిషి కింద పడిపోయాడు. అనంతరం బాలుడిని ఆసిఫాబాద్ సర్కార్ హాస్పిటల్ కు తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు అప్పటికే చనిపోయినట్లు చెప్పారు. సరిత ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై సాగర్ చెప్పారు.