- నిజామాబాద్ జిల్లా చేపూర్లో విషాదం
ఆర్మూర్, వెలుగు : నిజామాబాద్ జిల్లాలోని ఆర్మూర్ మండలం చేపూర్లో సోమవారం సాయంత్రం జొన్నసొప్ప దగ్ధమై నాలుగేండ్ల బాలుడు కన్నుమూశాడు. స్థానికుల కథనం ప్రకారం..నజియాబేగం, నజీరుద్దీన్ కు మహ్మద్ జియావుద్దీన్ (4) కొడుకు. ఇతడు వరుసకు చెల్లెలైన జైనా భానుతో కలిసి ఎప్పటిలాగే తమ ఇంటి సమీపంలోని పాడుబడ్డ గదిలో జొన్నసొప్ప వద్ద ఆడుకుంటున్నారు. ఆడుకుంటూనే జొన్న సొప్పకు నిప్పు పెట్టారు.
మంటలంటుకోవడంతో జైనా భాను బయటకు పరిగెత్తింది. మంటలు అంటుకుని ఊపిరి ఆడకపోవడంతో జియావుద్దీన్ అపస్మారక స్థితికి చేరుకుని అక్కడికక్కడే చనిపోయాడు. గమనించిన చుట్టుపక్కల వారు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. ఫైర్ స్టాఫ్ వచ్చి మంటలు ఆర్పివేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆర్మూర్ ఎస్ హెచ్ వో సురేశ్‌బాబు తెలిపారు.