తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం

తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి దుర్మరణం

భద్రాచలం, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో తలలో పెన్ను గుచ్చుకుని నాలుగేండ్ల చిన్నారి చనిపోయింది. పట్టణంలోని సుభాష్​నగర్​ కాలనీకి చెందిన రియాన్షిక (4) యూకేజీ చదువుతోంది. సోమవారం మంచంపై పడుకుని పెన్నుతో ఆడుకుంటోంది. అకస్మాత్తుగా బెడ్​పై నుంచి కింద పడడంతో చేతిలోని పెన్ను చెవి పైభాగంలో ని కణతలో గుచ్చుకుని అలాగే ఉండిపోయింది. తల్లిదండ్రులు వెంటనే దవాఖానకు తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఓ ప్రైవేటు దవాఖానలో ఆపరేషన్ చేసి పెన్ను తీశారు. అయితే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం కన్నుమూసింది.