మాదాపూర్, వెలుగు : బిజినెస్లోన్లు ఇప్పిస్తానని చీటింగ్చేసిన మోసగాడు అరెస్ట్ అయ్యాడు. మరో 12 మంది పరార్ అయ్యారు. మాదాపూర్ ఇన్స్పెక్టర్కృష్ణ మోహన్తెలిపిన ప్రకారం.. యూపీలోని లక్నోకి చెందిన మహమ్మద్ సద్దాన్ అన్సారీ(33)కి కేఫ్ బిజినెస్ లో నష్టాలు వచ్చాయి. దీంతో చెడు అలవాట్లకు బానిసగా మారాడు. ఈజీ మనీకోసం బిజినెస్ లోన్కోసం ఎదురుచూసే వారిని టార్గెట్ చేశాడు. తన ప్లాన్‌ను ఫ్రెండ్స్షాజీ అహ్మద్ సిద్దిక్‌తో పాటు మరో 11 మందికి చెప్పాడు. 2019లో ముంబైలోని కొలాబా ఏరియాలో విలువైన భవంతిని రెంట్ కు తీసుకుని ఆఫీస్ ఏర్పాటు చేశారు.
సిటీలోని కాకతీయ హిల్స్‌లో ఉండే శ్రీకాంత్ చౌదరికి సపాన్ సియా కైసీ అనే వ్యక్తి ద్వారా సద్దాన్ అన్సారీ పరిచయం అయ్యాడు. తను ప్రారంభించే సోలార్ మ్యాడ్యూల్స్మ్యాను ఫ్యాక్చర్ బిజినెస్‌కు రూ.150 కోట్లు లోన్ఇప్పించాలని అన్సారీని శ్రీకాంత్ చౌదరి కోరాడు. ముందుగా రూ.1.50 కోట్లు అడ్వాన్స్చెల్లించాలని చెప్పగా రూ. కోటిన్నర ఇచ్చాడు. రోజులు గడుస్తున్నా అన్సారీ లోన్ ఇప్పించకపోగా మోసపోయానని తెలుసుకుని బాధితుడు మాదాపూర్ పోలీసులకు కంప్లయింట్ చేయగా కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా శుక్రవారం సద్దాన్ అన్సారీని అరెస్ట్ చేశారు. మరో 12 మంది పరారీలో ఉన్నారు. గతంలో కూడా సద్దాన్ అన్సారీ పలువురికి బిజినెస్లోన్లు ఇప్పిస్తానని చీటింగ్ చేసినట్లు తేలింది. నిందితుడిపై వైజాగ్ , హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కేసులు నమోదై ఉన్నాయి.
ధారూర్ వెటర్నరీ సెంటర్ ఆఫీసర్ సస్పెన్షన్
వికారాబాద్, వెలుగు : జిల్లాలోని ధారూర్ మండలం ప్రైమరీ వెటర్నరీ సెంటర్ ఆఫీసర్ సురేందర్ నాయక్ ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ప్రతీక్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ‘ వెలుగు’ పేపర్ లో గురువారం ప్రచురితమైన‘ చనిపోయిన మేకను వేలాడదీసి నిరసన’.. న్యూస్ పై కలెక్టర్ స్పందించారు. డ్యూటీలో నిర్లక్ష్యం వహించినందుకుగాను సురేందర్ నాయక్ ను సస్పెండ్ చేశారు.