నల్గొండ అర్బన్, వెలుగు : ఎంజేఎఫ్ లయన్స్ క్లబ్, నల్గొండ చేతన ఫౌండేషన్, పెరుమాళ్ల హాస్పిటల్ నల్లగొండ సంయుక్తంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో శనివారం నల్లగొండలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో 160 మందికి వైద్య పరీక్షలు చేసినట్లు లయన్స్ క్లబ్ పీడీజీలు భీమయ్య, రఘుపతి నేతి తెలిపారు.
కార్యక్రమంలో ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ లయన్ మదన్మోహన్ రేపాల, చేతన ఫౌండేషన్ సభ్యులు కొంగర రామచందర్రావు, రంగారావు, ఎస్బీఐ రీజినల్ మేనేజర్ అలీముద్దీన్, క్లబ్ అధ్యక్షులు ఎల్వీ కుమార్, ఎస్వీడీజీ కేవీ ప్రసాద్, ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ మదన్మోహన్ రేపాల, రీజియన్ చైర్ పర్సన్ అశోక్ రెడ్డి గట్టుపల్లి, జోన్ చైర్ పర్సన్ శ్రీనివాస్ ఎర్రమాద, డాక్టర్లు, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.