కరెంట్ లేకున్నా కూల్... మట్టితో ఫ్రిజ్ తయారీ

రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫ్రిజ్. ఒకప్పుడు అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే వాడగలిగేవాళ్లు. ఆర్థిక సరళీకరణల తర్వాత మధ్యతరగతి ఇళ్లలో ఇప్పుడు ఫ్రిజ్జులు కనిపిస్తున్నా, పేదలకు మాత్రం ఇదింకా అపురూపమైన వస్తువే. ఫ్రిజ్జంటే మాటలా..? కొనాలంటే బోలెడు సొమ్ము ఉండాలి. అప్పో సొప్పో చేసి కొన్నా... దానికి నిత్యం విద్యుత్తు అందుతూనే ఉండాలి. ఫలితంగా కరెంటు బిల్లు పెరుగు తుంది. ఖర్మ కాలి అది గానీ పాడైతే, దానికి మరమ్మతు చేయడం కూడా భారీ ఖర్చుతో కూడుకున్న పనే.

మట్టితో ఫ్రిజ్ తయారీ

ఇవన్నీ తట్టుకోవడం సామాన్యులకు భారమే! అందుకే ఫ్రిజ్ ఇప్పటికీ కొన్ని వర్గాల వారికి అందుబాటులో లేదు. అయితే, ఇలాంటి బెడదలేవీ లేకుండా, అసలు విద్యుత్తుతోనే పనిలేని ఫ్రిజ్‌కు రూపకల్పన చేశాడు మన్‌సుఖ్‌భాయ్ ప్రజాపతి.  అందుకే ఇప్పుడు కరెంట్ లేకపోయినా.. చల్లగా ఉండే ఫ్రిజ్ లు అందుబాటులోకి వచ్చాయి.  అయితే వీటిని సహజ సిద్దంగా పర్యావరణంలో దొరికే మట్టితో కోయంబత్తూరుకు చెందిన మన్‌సుక్‌భాయ్ ప్రజాపతి  రిఫ్రిజిరేటర్‌ను తయారు చేశాడు. దీనికి ఆయన మిట్టి కూల్ అని పేరు పెట్టాడు. 

‘మిట్టీకూల్’ ఫ్రిజ్

ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిజ్ అని పేరు పెట్టి, మార్కెట్‌లోకి తెచ్చాడు మన్‌సుఖ్. ఈ ఫ్రిజ్‌కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి.   ఇందులో  5 కిలోల కూరగాయలు,  పండ్లను నిల్వ చేయవచ్చు.  విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్ ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్ లో  పైన ఉన్న అరలో  2 లీటర్ల నీటిని పోయాలి.  ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.

విద్యుత్ అవసరం లేదు

సాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిజ్ల్లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు.  కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు.  అందుకే ప్రస్తుతం  తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు  అత్యంత డిమాండ్ ఉంది.  ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు  మన్‌సుక్‌భాయ్ ప్రజాపతి.

బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిజ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు  రూ. 8,500... అంతే!