
అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు : హనుమాన్ జయంతిని పురస్కరించుకొని వనస్థలిపురంలోని జాగృతి అభ్యుదయ సంఘం సభ్యులు కోతులకు పండ్ల విందు ఇచ్చారు. శుక్రవారం వనస్థలిపురం సాహెబ్ నగర్ లోని ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కోహెడలోని ప్రసన్నాంజనేయ స్వామి ఆలయ గుట్ట వరకు బైక్ ర్యాలీ చేపట్టారు.
అక్కడి కోతులకు అరటి, జామ పండ్లు, క్యారెట్లు, పల్లీలు అందించారు. సంఘం ఛైర్మన్ భావన శ్రీనివాస్, టూరిజం కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొన్నారు.